గూగుల్ సెర్చింగ్ సెలబ్రిటీలలో సల్మాన్ ఖాన్, సన్నీలియోన్ టాప్!

శనివారం, 16 జులై 2016 (10:06 IST)
బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ గూగుల్ ఇండియన్స్ 2016గాను గూగుల్ సెర్చింగ్ సెలబ్రిటీలలో టాప్‌ప్లేస్ నినిలిచింది. అంతేకాదు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ లిస్ట్‌లో హీరోయిన్ల జాబితాలో సన్నీలియోన్ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే, ఐశ్వర్య రాయ్, ప్రియాంకా చోప్రా, తమన్నా, అలియా భట్, సోనాక్షి సిన్హాలు గూగుల్ జాబితాలో నిలిచారు. 
 
హీరోల్లో సల్మాన్‌ఖాన్ తర్వాత షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఇమ్రాన్ హష్మీలు టాప్ టెన్‌లో నిలిచారు.
 
క్లాసిక్ నటుల్లో అమితాబ్ బచ్చన్, రేఖలు మొదటి స్థానాల్ని దక్కించుకున్నారు. అమితాబ్ తర్వాత కమల్ హాసన్, రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, రాజ్‌కుమార్, ధర్మేంద్ర తదితరులు ఉన్నారు. దాదాపు పదేళ్లలో గూగుల్‌లో నెటిజన్ల సెర్చింగ్‌లో సన్నీ, సల్మాన్ ఖాన్ టాప్‌లో నిలిచారు. బాలీవుడ్ అందాల తారలని సైతం పక్కన పెట్టి శృంగార తార ముందుకు దూసుకుపోవడం నిజంగా విశేషమని సినీ పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి