ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో త్వరలో ఆమె నిర్మాతగా కూడా మారనుందంటూ కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. ఇటీవల కోలీవుడ్‌కు చెందిన ఓ యువ దర్శకుడు సమంతాను కలసి ఓ కథ చెప్పాడనీ, అది ఆమెను బాగా ఆకట్టుకుందనీ అంటున్నారు.
దానికి బడ్జెట్టు వేయమని చెప్పి, సమంతా ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తానంటూ ముందుకు వచ్చిందట. అయితే, అందులో ఆమె నటించదనీ, అది చిన్న బడ్జెట్టు సినిమా అనీ కూడా అంటున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.