ఆసక్తిగా మారిన సంక్రాంతి సినిమాలు - తప్పుకుంటున్న ఇద్దరు హీరోలు?

గురువారం, 4 జనవరి 2024 (11:02 IST)
Sankranti cinemalu
తెలుగు వాళ్ళకు సంక్రాంతి పెట్టింది పేరు.  అందరూ తమ తమ ఊళ్ళకు బారులుతీరి పండుగ చేసుకుంటారు. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాలు విడుదల చేస్తుంటారు. ఇంతకుముందు ఒకరిద్దు మాత్రమే సంక్రాంతి బరిలోకి వచ్చేవారు. ఆ తర్వాత థియేటర్ల సమస్య చిన్న సినిమాల నిర్మాతల గొడవతో ఒకటో అరో చిన్న సినిమా విడుదలచేయిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అదేలా వుంది. ఈ సారి సంక్రాంతికి మేము వస్తున్నామంటూ కొద్దిరోజులుగా నలుగురు హీరోలు ప్రచారం చేసేశారు. 
 
మహేష్ బాబు గుంటూరు కారం కు థియేటర్లు ఆల్ రెడీ ఫిక్స్ అయిపోయాయి. వాటిని కాదని వెంకటేష్ సినిమాకు ఇచ్చేది లేదు. అయితే కొన్ని థియేటర్లు మిగిలాయి. దీనిపై వెంకటేష్ కూడా నిన్ననే క్లారిటీ ఇచ్చాడు. ఒకప్పుడు మేం ఇద్దరు కలిసి నటించిన సినిమా విడుదలయింది. ఇప్పుడు విడివిడిగా వస్తున్నాం. రెండు ఆడాలని కోరుకుకుంటున్నాం అన్నారు.
 
ఇక నాగార్జున తో యువ దర్శకుడు విజయ్ బెన్నీ తీసిన నా సామిరంగ, రవితేజ తో కార్తిక్ ఘట్టమనేని తీసిన ఈగిల్, యువ హీరో తేజ సజ్జ తో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హను మాన్. సినిమాలు కూడా వున్నాయి. అయితే వున్న థియేటర్లు ఎవరెవరికి ఎంత శాతం వుండాలనేది ఇంకా ఎగ్జిబిటర్లలో క్లారిటీ రాలేదు. దీనిపై నిర్మాత, తెలంగాణలో పేరున్న పంపిణీదారుడు దిల్ రాజు మాత్రం ఎవరో ఒకరు తప్పుకుంటే బెటర్ అని తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన ఇద్దరు తప్పుకుంటే థియేటర్లలో అందరినీ న్యాయం జరుగుతుంది. లేదంటే వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలు కలెక్లన్లను రాబట్టలేవు. ఒకసారి ఆలోచించండి అని సూచించారు.
 
నిజానికి సినిమా రిలీజ్ ల విషయమై చివరి నిమిషంలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్ ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నాగార్జున తప్పనిసరిగా రావాల్సిందే అంటూ పట్టుపట్టినట్లు తెలుస్తోంది. తనకుసెంటిమెంట్ గా భావిస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఇకపోతే రవితేజ, తేజ్ సజ్జా సినిమాలు విడుదల వాయిదా పడవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే తేజ్ సజ్జా తన హనుమాన్ సినిమా కోసం బాలీవుడ్, కోలీవుడ్ లోనూ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే రామమందిరం సంక్రాంతి తర్వాత కనుక అప్పుడు విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు