బిగ్ బాస్ షో ముగిసినా శ్రీముఖికి లక్ లక్కలా అంటుకుందిగా (Video)

మంగళవారం, 19 నవంబరు 2019 (21:11 IST)
బిగ్ బాస్ 3 సీజన్ ముగిసింది. ఐతే బిగ్ బాస్ ఇంట్లో శ్రీముఖి అరుపులు, కేకలు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇక నాగార్జున అయితే అడిగి మరీ కేకలు వేయించుకున్నారు. జనం కూడా ఆ రేంజిలోనే స్పందించారు. మొత్తమ్మీద బిగ్ బాస్ పుణ్యమాని శ్రీముఖి క్రేజ్ అమాంతం మారిషస్ దీవుల దాకా వెళ్లిపోయింది. అదేనండీ, ఇటీవలే శ్రీముఖి కాస్త గ్యాప్ తీసుకుని హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేసి వచ్చింది కదా.
 
ఇక అసలు విషయానికి వస్తే శ్రీముఖిని మెయిన్ లీడ్ చేసుకుని మా టీవిలో రెండు పెద్ద ప్రోగ్రాములు రెడీ అయిపోతున్నాయట. బుల్లితెర రాములమ్మ అంటూ శ్రీముఖికి బిరుదు కూడా తగిలించారు కనుక ఇకపై బిగ్ బాస్ ఇంట్లోనే కాదు బుల్లితెరపైన కూడా అరుపులు, కేకలు జనం వినాల్సి వుంటుంది.

ఐతే ప్రస్తుతం శ్రీముఖి టాప్ యాంకర్లకు గట్టి పోటీ ఇస్తూ సూపర్ సోనిక్ విమానంలో దూసుకుని వెళ్లిపోతోందట. మొత్తమ్మీద శ్రీముఖికి లక్... లక్కలా అంటుకున్నట్లు లేదూ...?
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు