అయితే, చిత్రం విడుదలకు ముందే తొలి రెండు రోజులు థియేటర్స్ ఫుల్ కావడంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, డివైడ్ టాక్ రావడంతో మూడో రోజుకే ఈ కలక్షన్లు భారీగా పడిపోయాయి. దీంతో చిత్ర యూనిట్ తీవ్ర నిరాశకు లోను చేసింది.
మరోవైపు ఈ చిత్రం నిడివి ఎక్కువగా ఉండటంతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు. దీంతో పలు సన్నివేశాలను తొలగించారు. ఇందులో టాలీవుడ్ కమెడియన్ కింగ్ బ్రహ్మానందం సన్నివేశాలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ చిత్రం తొలి రోజే పది కోట్లకు పైగా వసూలు చేసినట్టు వినికిడి.