సుశాంత్ ఆత్మహత్య.. విమర్శల వలన కరణ్‌ జోహర్ కీలక నిర్ణయం..!

శుక్రవారం, 19 జూన్ 2020 (10:57 IST)
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం.. ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతే కారణం అని, ముఖ్యంగా కరణ్‌ జోహార్ స్టార్ కిడ్స్‌తో తప్ప కొత్తవాళ్లతో సినిమా చేయడు.. కొత్త వాళ్లను ప్రొత్సహించడు.. సుశాంత్‌ని అసలు ఎంకరేజ్ చేయలేదు అంటూ విమర్శలు రావడం తెలిసిందే. 
 
రోజురోజుకు కరణ్‌ జోహర్ పైన విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కరణ్‌ జోహర్‌ని ట్రోల్ చేస్తున్నారు. బ్యాన్ బాలీవుడ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్స్‌తో అదరగొట్టేస్తున్నారు. దీంతో కరణ్‌ జోహర్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
 
ఇంతకీ మేటర్ ఏంటంటే... ఈ విమర్శల నేపధ్యంలో కొన్నాళ్ల పాటు స్టార్ కిడ్స్‌తో సినిమాలు తీయకూడదు అని కరణ్ జోహర్ నిర్ణయం తీసుకున్నారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా... ఆల్రెడీ స్టార్ కిడ్స్‌తో ప్లాన్ చేసిన సినిమాలను కూడా క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. మరి.. త్వరలో కరణ్‌ జోహర్ ఈ విషయంపై ప్రకటన చేస్తారేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు