బాలీవుడ్‌లో అది కొత్తేమీ కాదు.. విమర్శించినా లాభం లేదు.. తాప్సీ

శనివారం, 17 జూన్ 2023 (07:11 IST)
బాలీవుడ్‌లో కొందరు తనను కావాలనే పక్కన పెట్టేశారని, అందుకే తాను హాలీవుడ్‌కు వెళ్లిపోయానని స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ చిత్రసీమపై హీరోయిన్ తాప్సీ స్పందించింది. 
 
బాలీవుడ్‌లో క్యాంపులు, ఫేవరెటిజం కొత్త కాదని తెలిపింది. అవి ఎప్పటినుంచో వున్నాయని.. సినీ పరిశ్రమలో పక్షపాత ధోరణి ఉంటుందనే విషయం తనకు ఇండస్ట్రీకి రాకముందే తెలుసని తాప్సీ వెల్లడించింది.
 
తమ సినిమాల్లోకి ఎవరు కావాలనుకుంటే వాళ్లనే తీసుకుంటారని.. అది వారి కెరీర్‌కు సంబంధించిన విషయమని తాప్సీ తెలిపింది. దానిపై విమర్శించడం వల్ల లాభం లేదని తాప్సీ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు