సదరు కుర్ర బిజినెస్ మేన్ టబునే పెళ్లి చేసుకుంటానని వెంటబడుతున్నాడని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ దృశ్యం చిత్రంలో నటిస్తున్న టబు నాగార్జునతో నిన్నే పెళ్లాడుతా చిత్రంతో ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వొదిన, అక్క పాత్రలు రావడంతో ఇక్కడ నటించడంలేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా ట్రై చేస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆమె పెళ్లి వార్త ఇప్పుడు చెక్కెర్లు కొడుతోంది. ప్రస్తుతం టబు వయసు 44 ఏళ్లు మరి.