నాగార్జున వారసుడు అక్కినేని హీరో నాగచైతన్య వరుస సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటింటిన ''ప్రేమమ్'' ''సాహసం శ్వాసగా సాగిపో'', రెండు చిత్రాలుకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత చైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా పాలబుగ్గల సుందరి తమన్నా ఎంపికైంది.
మొదట ఈ సినిమాలో హీరోయిన్గా సమంత అయితే బావుంటుందని దర్శకనిర్మాతలు భావించారట. కానీ చైతు, సమంతలపై వస్తోన్న ప్రేమ పుకార్ల కారణంగా సమంతను తప్పించి ఆ స్థానంలోకి మరో హీరోయిన్ అనుకున్నారు. అప్పుడే మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపించింది.
గతంలో చైతు - తమ్మూ ''100% లవ్'', ''తడాఖా'' వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో చైతు సరసన తమన్నా అయితే బావుంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. మరి వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న తమ్మూ ఈ సినిమాకు ఓకే చెబుతుందో లేదో అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.