బెంగాల్ టైగర్ లో మిల్కీ బ్యూటీ రొమాంటిగ్ సాంగ్... అందాలను ఆరబోసిందట...

బుధవారం, 27 మే 2015 (15:57 IST)
మిల్కీబ్యూటీ తమన్నా.. ఈమధ్య రొమాంటిక్‌ సాంగ్‌ చేసింది. రవితేజతో కలిసి చేసిన ఈ పాట అద్భుతంగా వచ్చిందని దర్శకుడు సంపత్‌నంది తెలియజేస్తున్నాడు. బెంగాల్‌ టైగర్‌లో తమన్నా తన అందాలను ఆరబోసిందని పక్కామాస్‌ సాంగ్‌ ఇదని చిత్ర యూనిట్‌ తెలియజేస్తుంది. మరో నటి రాశీఖన్నా వున్నా.. ఆ పాత్ర కూడా చాలా సరదగా వుంటుందని, ద్వంద్వార్థాలు లేవని చెబుతున్నారు. గ్లామర్‌ పాత్రలతో పాటు నటనలో కూడా వారిద్దరూ పోటీపడి నటించారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి