2015 దశ తిప్పుతుందట... తమన్నా ఆశ

శనివారం, 3 జనవరి 2015 (15:59 IST)
ఈ ఏడాది తన కెరీర్‌పై ఆశలు పెట్టుకుంది తమన్నా. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలితో పాటు సంపత్‌ నంది దర్శకత్వంలో రాబోతున్న బెంగాల్‌ టైగర్‌పై హోప్స్‌ పెట్టుకుంది. గత ఏడాది కెరీర్‌ బాగున్నా.. ఈ ఏడాది మాత్రం భారీ ప్రాజెక్ట్‌లు తన కెరీర్‌పై ప్రభావం చూపుతాయని చెబుతోంది. 

 
ఈ రెండు చిత్రాల్లో తన నటనకు మంచి గుర్తింపు వస్తుందని అంటోంది. అయితే చాలామంది ఇవి పూర్తిస్థాయి పాత్రలు కాకపోయినా.. చిన్న పాత్రలయినా వాటిలోని ప్రాధాన్యతారీత్యా తనకు ఎంతో పేరు వస్తుందని చెప్పింది. నటి ఎటువంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమయినప్పుడు చిన్నా, పెద్ద పాత్రలను ఆలోచించకూడదని అంటోంది. భారీ దర్శకుడు, బేనర్‌ చేయడం అదృష్టంగా భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి