దెయ్యానికి- టాక్సీ డ్రైవర్‌కు మధ్య సాగే కథే.. అర్జున్ రెడ్డి టాక్సీవాలా?

సోమవారం, 21 మే 2018 (18:08 IST)
''అర్జున్ రెడ్డి''కి తర్వాత మహానటి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ట్యాక్సీవాలాగా తెరపైకి రానున్నాడు. ఈ చిత్రం ద్వారా రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ సినిమాను జూన్ 15 లేదా 22వ తేదీన రిలీజ్ చేసేందుకు సినీ యూనిట్ సిద్ధమవుతోంది. 
 
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా.. ఓ ట్యాక్సీ డ్రైవర్‌కి.. ఓ దెయ్యానికి మధ్య సాగుతుందని టాక్. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో రూపొందే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలను సాయికుమార్ రెడ్డి అందించారు. జీఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేష‌న్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్కేఎన్ నిర్మాత.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు