యువ రక్తం అంటేనే సరదాగా ఎంజాయ్ చేయడం. హీరో రేంజ్ పెరిగాక వారి అలవాట్లు మామూలుగా వుండవు. ఇప్పుడున్న యూత్ హీరోలు తమకుతాము ప్రమోట్ చేసుకునేందుకు ఓ వేదిక కావాలి. అందుకోసం రహస్యంగా కొందరు కలిసి పార్టీలు చేస్తూ.. తమ కెరీర్ను ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. వీరంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కావడం విశేషం. అందులో అల్లు అర్జున్, రానా, మంచులక్ష్మితో పాటు పలువురు వున్నారు.