ఏ హీరోతోనైనా కలిసి ఏక్ట్ చేయాలనేది కొత్తగా హీరోయిన్గా నిలదొక్కుకునేవారి ఆలోచన వుంటుంది. కానీ కొందరు పలానా హీరోతో చేయాలంటే నో చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆమధ్య శివాజీ వెల్లడించారు. నా సినిమాకు హీరోయిన్లను ఎవ్వరినీ రానీయకుండా కొందరు దుష్ర్పచారాన్ని చేస్తున్నారని మీడియా ముందు వాపోయాడు. సరే.. ఆయన సినిమా విడుదలయినా.. సక్సెస్‌లు లేక.. ఎప్పుడొచ్చిందో.. వెళ్ళిపోయిందో కూడా తెలీకుండా పోతున్నాయి.
ఇప్పుడు అదే పరిస్థితి వరుణ్ సందేశ్‌కు వచ్చింది. వరుణ్‌కు సక్సెస్‌లు లేకపోయినా.. చిత్ర నిర్మాణాలు జరుగుతూనే వున్నాయి. రకరకాల గెటప్ల్లో చేసినా ప్రేక్షకులు ఆయన్ను గుర్తించడంలేదు. ఇటీవలే లవకుశలో నటించాడు. అందులో రిచా పనయ్ చేసింది. ఈ చిత్రం నీకు మంచి బ్రేక్ ఇస్తుందని దర్శకుడు, హీరో కూడా చెప్పడంతో అమ్మడు ఆశపడి నటించింది.