విక్రమ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న తమిళ చిత్రం ''ఇరుముగన్''. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, నయనతారలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిలన్, లవ్ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన చిత్ర ట్రైలర్ను చూస్తే విక్రమ్ సినిమాపై అంచనాలను మరోసారి భారీగా పెంచేసింది.
సెప్టెంబర్ 2వ తేదీన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమాని 8న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై యూట్యూబ్లో సంచలనం రేపుతోంది. మరి ఈ చిత్రంతో విక్రమ్ ఇంకెన్నిసంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే.