ఇతడు ఇప్పటికే సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో, అమితాబ్ నటించిన వజీర్ చిత్రాల్లో నటించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఈ నేపధ్యంలో సాహో చిత్రంలో ప్రభాస్ సాహోలో విలన్ పాత్రకు ఇతడిని అడిగారట. దీనికి నీల్ నితిన్ ఒకే చెప్పేశాడట.
ఐతే అంతకుముందు చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంలో విలన్‌గా నటించమంటే నో చెప్పిన ఇతడు ఇప్పుడు ప్రభాస్ చిత్రంలో నటించడానికి ఎలా అంగీకరించాడబ్బా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరైతే... 60 ఏళ్ల చిరు హీరోను కొడితే ఏమొస్తుంది... 37 ఏళ్ల బాహుబలిని కొడితే వచ్చే కిక్కే వేరని నీల్ నితిన్ అనుకోవడం వల్లే అంగీకరించి వుంటాడని సెటైర్లు వేస్తున్నారు.