రాజకీయాల్లోకి కమల్ హాసన్.. తండ్రికి తోడుగా అక్షరహాసన్...
సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:26 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ టాప్ హీరోయిన్‌గా మంచి మార్కులేసుకుంది. ఉత్తరాది, దక్షిణాది సినీ రంగాల్లో మంచి గుర్తింపు కొట్టేసింది. అయితే కమల్ హాసన్ రెండో కుమార్తె మాత్రం సినీ రంగంలో నిలదొక్కుకోలేకపోయింది.
సినీ రంగంలో అంతగా రాణించలేకపోతున్న అక్షర హాసన్ ఇక తండ్రికి తోడుగా వుండిపోవాలని నిర్ణయించుకుంది. త్వరలో కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో... రాజకీయాల్లో తండ్రి సహకరించాలని అక్షర హాసన్ డిసైడ్ అయ్యింది.
త్వరలో కమల్ హాసన్ కొత్త పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆ దిశగా ఫ్యాన్స్‌ను నడిపించే ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో తండ్రికి సహాయ సహకారాలను అందించాలని అక్షర హాసన్ నిర్ణయించుకుందట.
తండ్రి ఆదేశాలను బృందానికి చేరవేసేందుకు.. సామాజిక అంశాలకి సంబంధించిన స్క్రిప్ట్‌లను సిద్ధం చేయడంలోనూ ఆమె చురుగ్గా వున్నట్లు సమాచారం. అభిమానుల సంఘాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి తండ్రి నడిచే రాజకీయ బాటలో ఆయన వెంట నడవాలని అక్షర హాసన్ రెడీ అవుతోందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది.