గోల్డెన్ కేలా నాలుగో వార్షికోత్సవ అవార్డులకు సోనమ్ కపూర్, అజయ్ దేవ్‌గన్‌లు ఎంపికయ్యారు. వరస్ట్ యాక్టర్ విభాగం కింద వీరిద్దరు ఎంపికయ్యారు. వరస్ట్ యాక్టర్ ఫీమేల్ కేటగిరిలో సోనమ్ 'మౌసమ్' సినిమాకు ఎంపికకాగా, వరస్ట్ యాక్టర్ మేల్ కేటగిరిలో అజయ్ 'రాస్కేల్స్' సినిమాకు ఎంపికయ్యారు. వరస్ట్ ఫీమేల్ యాక్టర్ విభాగం కింద సోనమ్‌తో సహా 'అరక్షన్' సినిమాకు దీపిక పడుకొనే, 'తను వెడ్స్ మను' సినిమాకు కంగనా రనావత్, 'రోక్‌స్టార్' సినిమాకు నర్గిస్ ఫక్రీ ఎంపికయ్యారు.