వేల సంఖ్యలో 'ఆదిపురుష్' టిక్కెట్ల కొనుగోలు.. ఉచితంగా పంపిణీ .. ఎక్కడ?

గురువారం, 15 జూన్ 2023 (16:43 IST)
ప్రభాస్ - కృతి సనన్ జంటగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్న భాషల్లో విడుదలకానుంది. అయితే, ఈ చిత్రాన్ని అత్యధిక మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో టికెట్ల విక్రయంపై ఆఫర్లు ప్రకటించారు. రామాయణ పారాయణం జరిగే చోటుకు హనుమంతుడు విచ్చేస్తాడనే నమ్మకంతో ‘ఆదిపురుష్‌’ టీమ్‌ ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయిస్తుండగా.. మరికొందరు వేల సంఖ్యలో టికెట్లను కొని, పేదలకు అందిస్తున్నారు. 
 
ఇలా ఉచితంగా టిక్కెట్లు కొనుగోలు చేసిన వారిలో ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ముందుగా 10 వేలకుపైగా టికెట్లను కొనుగోలు చేసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు చెందిన వారికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
 
ఆయన బాటలోనే బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, సింగర్‌ అనన్య బిర్లాలు తమ వంతుగా ఒక్కొక్కరు 10 వేల టికెట్లు బుక్‌ చేసి, పేద చిన్నారులకు అందిస్తున్నారు. టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ సైతం ఇందులో భాగమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లో ఉంటున్న 2500 చిన్నారులకు ఈ సినిమాని ఉచితంగా చూపించనున్నట్టు తెలిపారు. 
 
ప్రముఖ ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉన్న రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇవ్వనున్నుట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. వీటి సంఖ్య లక్షకుపైగా ఉండొచ్చని సమాచారం. అంటే.. మొత్తం 1,32,500లకిపైగా ‘ఆదిపురుష్‌’ టికెట్లు ఫ్రీ అని చెప్పొచ్చు. ఇండియన్‌ సినిమాలో ఇదొక కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు