ఎన్నో రికార్డులు నెలకొల్పిన రాజమౌళి 'బాహుబలి' చిత్రం తొలిసారిగా తెలుగు నేల నుంచి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుని తెలుగోడి సత్తాను చూపింది. 63వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం నాడు దిల్లీ విజ్ఞాన భవనంలో జరుగుతోంది. అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బహూకరణ జరుగుతోంది.