కుమార్తె వివాహానికి తెలంగాణ గవర్నర్‌ను ఆహ్వానించిన అలీ

గురువారం, 10 నవంబరు 2022 (10:54 IST)
తెలుగు హాస్య నటుడు అలీ తన కుమార్తె వివాహాన్ని గ్రాండ్‌గా చేయనున్నారు. ఇందుకోసం పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఆయన తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెను కలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె ఫాతిమి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. తమతో గవర్నర్ ఎంతో అభిమానంగా మాట్లాడారని, చాలా సంతోషంగా ఉందన్నారు. 
 
తాను తమిళంలో మాట్లాడంతో ఆమె ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పారు. సినిమాలలో తనను చూడటం ద్వారా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తనతో అన్నారని, ఈ మాటలు చాలా ఆనందానికి, సంతోషానికి గురిచేశాయని చెప్పారు. 
 
మరోవైపు, అలీ తనను కలిసినట్టు గవర్నర్ తమిళిసై సూడా ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారని అందులో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు