భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరితే ఒకరి ముఖం ఒకరు చూస్కునే పరిస్థితి లేకపోతే ఇక విడాకులే శరణ్యమని చాలామంది దంపతులు కోర్టులకెక్కుతారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనే విడాకుల సంఖ్య ఎక్కువ ఉంటుందని అనుకుంటారు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా ఈమధ్య విడాకుల కోసం కోర్టు గడప తొక్కుతున్నారు. తాజాగా ఈ జాబితాలో రాజమౌళి ఈగ ఫేమ్ సుదీప్ కూడా చేరిపోయారు.