నేను లుకింగ్ హాటా? రేయ్ పిచ్చిదానిలా వున్నానిక్కడ: నటి హేమ రిప్లై

శుక్రవారం, 7 మే 2021 (16:19 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ స్టార్ హేమ. ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే మాట్లాడేసే నటీమణుల్లో హేమ ఒకరు. కరోనా కారణంగా ఇటీవల షూటింగులు క్యాన్సిల్ అయ్యాయి. దీనితో హేమ కూడా ఇంట్లోనే వుంటోంది. ఐతే తాజాగా ఆమె కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వెళ్లింది.
 
అక్కడ నుంచి తన అభిమానులతో ఇన్‌స్టాగ్రాంలో లైవ్ చాట్ చేసిది. కరోనా తీవ్రంగా వుందనీ, అందరూ మాస్కులు వేసుకోవాలని సూచించింది. అలాగే కోవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ ఏది దొరికితే అది టీకా వేసుకోవాలని సూచన చేసింది. ఇంతలో ఓ నెటిజన్ లుకింగ్ హాట్ అంటూ కామెంట్ చేసాడు.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hema_Kolla (@urshemakolla)

దీనితో హేమ.. 'నేను లుకింగ్ హాటా? రేయ్ పిచ్చిదానిలా వున్నానిక్కడ. నన్ను చూస్తే ఎవరైనా చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా' అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు