"కొత్త సంవత్సరం మా ఇంట్లోకి అనుకోని అతిథిలా మిస్టర్ కరోనా వచ్చింది. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటుఇవ్వను. ప్రజలారా అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు చోటివ్వండి" అంటూ ట్వీట్ చేశారు.
అలాగే, కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ కూడా ఈ వైరస్ బారినపడినట్టు బుధవారం తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. "తనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేశారు.