సాధారణంగా సెలెబ్రిటీల కోసం, సినీ నటీనటులతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడుతుంటారు. ఇందుకోసం వారి కార్ల వెంట పరుగులు తీస్తుంటారు. కానీ, ఆ నటి మాత్రం.. ఓ మహిళా ఆటో డ్రైవర్‌తో సెల్ఫీ దిగేందుకు నానా తంటాలు పడింది. చివరకు ఆమె నడుపుతున్న ఆటోను వెంబడించి తన కోర్కెను తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఎవరా నటి అనే కదా మీ సందేహం. ఆమె ఎవరో కాదు. బొద్దుగుమ్మ నమిత.