జయభేడా గత కొంతకాలంకా ఎండోమెట్రియల్ కేన్సర్ నాలుగో దశతో బాధపడుతూ వచ్చారు. దీంతో మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం పనీతీరు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే ఆమె మృతికి ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు.
మరోవైపు, తన తల్లి మృతిపై జయభేడా రాఖీసావంత్ ఓ ట్వీట్ చేశారు. తన తల్లి పడకపై ఆఖరి క్షణాల్లో ఉండగా, రాఖీసావంత్ కింద కూర్చొని ఏడుస్తుండగా ఈ వీడియోను తీసి, తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఉద్వేగభరితమైన టెక్స్ట్‌ను జతచేసింది.
"ఈ రోజు నా తల నుంచి నా తల్లి చేయి దూరమైంది., ఇంక నేను కోల్పోవడానికి ఏమీ లేదు. ఐ లవ్ యూ అమ్మా... నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరు. ఇపుడు నేను ఎవరితో మాట్లాడాలి. నన్ను ఎవరు ప్రేమగా కౌగలించుకుంటారు. నేనేం చేయాలి. నేను ఎక్కడికి పోవాలి. ఐ మిస్ యూ అమ్మా అని పేర్కొంది.