విశాఖ‌తో నాకు చాలా అటాచ్‌మెంట్ ఉంది... సినీ న‌టి రెజీనా

శుక్రవారం, 13 మే 2016 (21:55 IST)
విశాఖ సాగరతీరంలో ప్రముఖ తెలుగు సినీ నటి రెజీనా సందడి చేసింది. ద్వారకానగర్ లోని కేసియో వాచ్ షాప్ ఓపెనింగ్‌కి ఈ అమ్మ‌డు వ‌చ్చింది. రెజీనాను చూడ‌టానికి ప్యాన్స్ పోటీపడ్డారు. ఆమెతో ఫోటోలు దిగాల‌ని ట్రై చేశారు కానీ, రెజీనా నో చెప్పింది. అనంత‌రం వాచ్ ప్ర‌మోష‌న్ చేయ‌డ‌మే కాకుండా, విశాఖ మహా నగరానికి త‌న‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉందంది. 
 
త‌ర‌చూ ఇలా సాగ‌ర తీరంలో ఓపెనింగ్స్‌కి రావ‌డ‌మేనా... లేక ఇంకేమైనా అనుబంధం ఉందా అంటూ, అక్క‌డున్న‌వారంతా కిస్సుక్కుమ‌న్నారు. హాట్ రెజీనాను చూసి కొందరు చెవులు కొరుక్కున్నారు కానీ విషయం ఏమీ బయటకు రాలేదు మరి.

వెబ్దునియా పై చదవండి