తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా ఉత్తరాది అమ్మాయిలే హవా కొనసాగిస్తున్నారు. అరకొర తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా వేషం వేసేందుకు ముందుకు వచ్చినా వారికి సరైన అవకాశాలు లభించడం లేదు. దీనికి కారణం... క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే ఈ విషయంపై పలువురు తెలుగు అమ్మాయిలు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇలాంటి వారిలో స్వాతి నాయుడు, శ్రీ రెడ్డి, తేజస్వి మదివాడ ఇలా చాలమంది ఉన్నారు. ముఖ్యంగా, ఈ ముగ్గురు తెలుగు అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా తేజస్వి మదివాడ కూడా ఇదేతరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
తాజాగా తేజస్వి "కమిట్‌మెంట్" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం టీజర్ బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో ఈ అమ్మడు తారా స్థాయిలో రెచ్చిపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నా. తెలుగు అమ్మాయిలను కమిట్‌మెంట్ అడగటం ఈజీ అనే అభిప్రాయం ఉంది. నన్ను డైరెక్ట్‌గా కమిట్‌మెంట్ అడిగారు' అని చెప్పుకొచ్చారు.
పైగా, క్యాస్టింగ్ కౌచ్‌పై తన అభిప్రాయాలను కూడా బహిర్గతం చేసింది. అంటే తెలుగు అమ్మాయిలకు సినీ ఛాన్సులు దక్కాలంటే ఖచ్చితంగా పడుకోవాల్సిందేనని ఆమె తెగేసి చెప్పింది. ఈ విషయంలో ఉత్తరాది భామలు ముందు వరుసలో ఉన్నారనీ అందువల్లే వారికి ఎక్కువ ఛాన్సులు వస్తున్నాయని ఆమె చెప్పకనే చెప్పింది.