హైదరాబాద్ : డి.ఎస్పీ... అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్. ఆయన మ్యూజిక్‌కి క్రేజ్ చాలానే ఉంది. దానిని క్యాష్ చేసుకోవడానికి డిఎస్పీ స్టేజ్ షోలలో మ్యూజిక్కుతో పాటు పాటలు, స్టెప్పులు వేస్తుంటాడు. అదే క్రేజ్‌లో సినిమా హీరోయిన్లను వేటాడుతుంటాడని రూమర్స్ ఉన్నాయి. టాలీవుడ్‌లో అందరూ ముద్దుగా డిఎస్పీ అని పిలుస్తుంటే, ఆయన మాత్రం హీరోయిన్ల వెంటపడుతున్నాడని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ఇలా వెంటపడిన వారి లిస్ట్ చాలానే ఉంది.
గతంలో హీరోయిన్ ఛార్మితో డిఎస్పీ పెళ్ళి కాబోతోందని ప్రచారం జరిగింది. అయితే, చివరికి ఛార్మీ డిఎస్పీ సోదరుడు సాగర్‌కు రాఖీ కట్టడంతో రిలేషన్ కట్ అయింది. తర్వాత డిఎస్పీ లావణ్య త్రిపాఠి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆమె ఫోటోలను కెమేరాలో బంధించి, చూపెట్టాడు. డిఎస్పీలో మంచి మ్యూజిక్ డైరెక్టరే కాదు తనలో ఓ మంచి ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నాడని అందరూ పొగిడారు.
లావణ్య త్రిపాఠి మంచి రేంజ్ లోకి వెళ్లి డిఎస్పీని విస్మరించడంతో ఇపుడు కొత్తగా హీరోయిన్ వేదిక చుట్టూ తిరుగుతున్నాడట. మళ్ళీ హీరోయిన్ వేదికని తన కెమెరాతో షూట్ చేసాడట. వేదిక కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాలు చేస్తోంది. వేదిక, దేవి షూట్ చేసిన ఫోటో సూపర్‌గా వచ్చిందంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆమెతో రూమర్స్ స్టార్ట్. అయితే, ఇలా డిఎస్పీ ఎంతమందిని కెమేరాలో బంధిస్తూ, తిరుగుతాడో తెలియడంలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గానే కాదు.. ఇపుడు మోస్ట్ ఏజ్‌డ్ బ్యాచిలర్ అయిపోతున్న డిఎస్పీ త్వరగా ఏదైనా పెళ్లి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు సినీ వర్గీయులు.