తాజాగా భారీ నిర్మాణ సంస్థ ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా దర్శకుడు కిశోర్ తిరుమల చిత్రం చేయనున్నాడు. ఇటీవలే దానిని ప్రకటించాడు. అలాగే ఓ వెబ్ సిరీస్‌లో చైతు నటిస్తున్నాడని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ నిర్మాణ సంస్థతో వెంకటేష్, రానా నటిస్తున్న ఈ సీరిస్‌లో చైతు ఓ పార్ట్ కానున్నాడని విశ్వసనీయ సమచారం.
ఇదిలా వుండగా, మరో క్రేజీ కాంబినేషన్‌లో చైతు చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో విజయాన్ని అందుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో చై నటించనున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇక తన కాన్‌సన్‌ట్రేషన్ అంతా సినిమాలపైనే అంటూ ఇటీవలే చైతన్య కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. సో.. ఒకవైపు విడిపోయిన సమంత, బిజీ అయితే అంతే ఇదిగా చైతు కూడా బిజీగా వున్నాడన్నమాట.