నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా ఆమె తెరకెక్కించిన ఇందులో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ సఱ్మ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 25న సోని లివ్ లో మీట్ క్యూట్ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దీప్తి, నాని తాజా ఇంటర్వ్వూలో మీట్ క్యూట్ విశేషాలు తెలిపారు