"లీకైతే ఏమైంది. ఒరిజిన‌ల్ ఫోటో ఇదే".. అఖిల్ కొత్త చిత్రంపై నాగ్ స్పందన

శనివారం, 19 ఆగస్టు 2017 (06:46 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ అక్కినేని హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "మనం" ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
 
ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ స్టిల్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. అఖిల్ ఫైట్ చేస్తుండ‌గా.. హీరోయిన్ అత‌డిని ప‌ట్టుకొని ముద్దుపెడుతున్న సీన్. వెన‌క చాలా మంది రౌడీలు కూడా ఉంటారు. 
 
ఈ లీకైన ఈ స్టిల్‌పై స్పందించిన నాగ్... "లీకైతే ఏమైంది. ఒరిజిన‌ల్ ఫోటో ఇదే. దీని క‌న్నా పెద్ద‌దైన‌, మెరుగైన ఫోటోను ఆగ‌స్టు 21వ తేదీన రిలీజ్ చేస్తాం. దానికి సంబంధించిన క్లూను రేపు ఇస్తా" అంటూ ట్వీట్ చేశాడు నాగార్జున‌. 
 
కాగా, ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్, మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై నాగార్జ‌న ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అఖిల్‌కు జోడుగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిని ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు