కొవిడ్ నిబంధనల మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ వైద్య చికిత్సలు చేయించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల తనను సంప్రదించిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ప్రస్తుతం అక్షయ్ కుమార్ "రామ్ సేతు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. "
ఇటీవల బాలీవుడ్‌లో అలియాభట్, మిలింద్, ఆర్ మాధవన్, అమీర్‌ఖాన్, రణబీర్ కపూర్, కరిక్ ఆర్యన్, రోహిత్ సరఫ్, సిద్ధాంత్ చతుర్వేది, మనోజ్ బాజ్‌పేయి, రణ్‌వీర్ షోరే, మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. శనివారం ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌తో పాటు కోడలికి వైరస్ సోకింది. రోజు రోజుకు వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో బాలీవుడ్‌లో ఆందోళన కలిగిస్తోంది.