''సిద్ధార్థ'' సినిమా ఆడియో వేడుకలో హాస్యనటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తద్వారా ప్రేక్షకులను నవ్వులు పూయించాయి. సిద్ధార్థ ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, పరుచూరి బ్రదర్స్, దర్శకుడు బాబీ హాజరయ్యారు. ఇంకా ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ హాస్య నటుడు అలీ నవ్వులు ఆ వేడుకలో నవ్వులు పూయించారు.
"అందరి హీరోలకు మాటలు రాసిన పరుచూరి బ్రదర్స్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మాటలు రాయలేదు. ఆ అవకాశం వారికి నేను కల్పిస్తాను.. పవన్ కల్యాణ్‌కు నేను చెబుతాను" అని అలీ అనడంతో అందరూ పగలపడి నవ్వేశారు. ప్రసంగం చివర్లో.. సుమా రాగానే ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆమెతో ఇంతకన్నా మాట్లాడితే ప్రమాదమని.. ఏం మాట్లాడినా నెట్లో పెట్టేస్తున్నారనగానే అందరూ నవ్వేశారు. ఇలా అలీ మాట్లాడినంత సేపూ ప్రేక్షకులు హాయిగా నవ్వుకున్నారు.
పనిలో పనిగా వెబ్ సైట్లను సుమ, అలీ ఏకిపారేశారు. ఉన్నది ఉన్నట్లు రాయడం మంచిదని.. ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారని.. పేద పిల్లలకు చదువులు లేవని అలాంటి వారికి సాయం చేయండి అంటూ రాస్తే వెబ్ సైట్లు ఎక్కడికో పోతాయి కానీ ఉత్తుత్తివే రాస్తే ప్రయోజనం శూన్యమని సుమ, అలీ కౌంటరిచ్చారు. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్‌లో తన కుమారుడు రోషన్ పుట్టిన రోజు కోసం వెళ్తున్నానని స్టేజ్‌ని ఇక మీరు చూసుకోండని అలీ చెవిలో చెప్తే.. ఆయనకు తానేదో వార్నింగ్ ఇచ్చినట్లు, తన భర్త కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు వెబ్ సైట్లు రాసేశాయని ఫైర్ అయ్యారు. అలాగే నెట్ వాళ్లకి శత వందనాలు.. నెట్‌లో చాలా వస్తున్నాయి.
కానీ సెట్ మీద రాకుండా చూద్దామని సుమ చెప్తే.. అలీ ఎందుకమ్మా.. సెట్ మీద ఏది మాట్లాడినా నెట్లోకి వెళ్ళిపోతున్నాయని సెటైర్ వేశారు. సైమా ఫంక్షన్లో సుహాసిని గారితో మాట్లాడలేదని.. దానిపై ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారని, సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్‌లో యాంకరింగ్ చేస్తుంటే.. సుమ తన కుమారుడి పుట్టిన రోజుకు వెళ్తున్నానని చెప్తే దానిని వేరే విధంగా రాసేశారని అలీ చెప్పాడు. అసల్ది సిసల్ది రాయకుండా లేనిపోని రాస్తే ఏమొస్తది ఏమీ రాదు.. అంటూ అలీ చెప్పుకొచ్చాడు. మాట్లాడాల్సిన తరుణం కాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి వెబ్ సైట్ల గురించి చెప్పాల్సి వచ్చిందన్నారు.