రొమాన్స్‌కు మ్యారేజ్ అక్కర్లేదు.. రిలేషిన్‌షిప్ చాలు: అల్లు శిరీష్.. ట్విట్టర్లో రొమాంటిక్ వార్

మంగళవారం, 20 జూన్ 2017 (15:34 IST)
అల్లు వారి ఫ్యామీలీ దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్‌తో ఖుషీ ఖుషీగా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో.. అల్లు వారబ్బాయి శిరీష్.. తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ రొమాంటిక్ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. తనకు వర్షం అంటే గిట్టదని.. వర్షంలో తనకు ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ కనిపించవన్నాడు. సూర్యడు లేకుండా మబ్బులు కమ్మిన వాతావరణంలో తాను డల్‌గా మారిపోతానని శిరీష్ ట్వీట్ చేశారు.
 
దీనిపై అల్లు ఫ్యాన్స్ విభిన్నాభిప్రాయాలు పోస్ట్ చేస్తూ వార్ మొదలెట్టారు. దీనిపై భయ్యా మీకు పెళ్లీడు వచ్చింది. పెళ్లి చేసుకుంటే అంతా రొమాంటిక్‌గా అనిపిస్తుంది. రోడ్డుపై బురద కూడా బ్యూటీఫుల్‌గా కనిపిస్తుందని కామెంట్ చేశాడు. దీనికి శిరీష్ స్పందిస్తూ.. ఇప్పటికే వర్షంతో ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంటే.. రొమాన్సేంటి.. రొమాన్స్‌కి మ్యారేజ్ అక్కర్లేదు. రిలేషన్‌షిప్ చాలు అన్నాడు. 
 
అలాగే మరో ఫ్యాన్.. శిరీష్‌ను పూర్వ జన్మలో గృహిణిగా పుట్టివుంటారని.. కామెంట్ చేయగా, ఓ నవ్వు నవ్వి ఏమో.. కానీ ఈ జన్మలో తన గర్ల్ ఫ్రెండ్ సంపాదిస్తే కూర్చుని హాయిగా ఆమెకు వండిపెట్టేందుకు సిద్ధంగానే ఉన్నానని.. గృహిణిగా బాధ్యతలు స్వీకరించడం అంత ఈజీ కాదని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి