ఈ వివరాలను పరిశీలిస్తే, అమలాపాల్ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పేరు "అదో అంద పరవై పోల" (అదో ఆ పక్షిలాగా). ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఆమె కాళ్లు చేతులు కట్టేసి.. ఓ అటవీ ప్రాంతంలో కూర్చోబెట్టారు. దీన్ని ఆమె ఫోటో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది.
ఈ మూవీతో కేఆర్ వినోద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్వెంచర్, థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేరళ, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కూడా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.