ఇటీవలే నటి అమలాపాల్ తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఎత్తైన కొండ ప్రాంతంలో అంచున పిట్టగోడపై ఒకరు నులుచుని వుండగా ఆయన తొడపై అమలాపాల్ కూర్చుని తదేకంగా అతన్నే చూస్తున్న స్టిల్ అది. దీనిపై నెటిజన్లు బాగానే రియాక్ట్ అయ్యారు. దీంతో అమలాపాల్ కొత్త వ్యక్తితో ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆయన తన లవర్ కాదని, సోదరుడు అంటూ చెబుతూ, ప్రేమ లాంటి ప్రేమతో బ్రదర్‌తో వున్నానంటూ సమాధానమిచ్చింది. ఈమె గురించి తెలిసిన ఓ అభిమాని ఇది చైల్డ్ హుడ్ ఫొటోనా బాగుంది అంటూ ట్వీట్ చేశాడు.