నేను ఆయన భక్తుడిని - పాదాలను తాకాను: 'బిగ్ బి' అమితాబ్

గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:30 IST)
సాధారణంగా బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌ను అందరూ ముద్దుగా 'బిగ్ బి' అని పిలుస్తుంటారు. అందరికీ గురుపూజ్యుడైన ఆయన ఒక దక్షిణాది లెజెండరీ యాక్టర్ పాదాలను తాకుతున్నానంటూ పెట్టిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘మాస్టర్‌ శివాజీ గణేషన్‌ నీడలో ఇద్దరు శిష్యులు.. సూర్య, నేను! తమిళ సినిమా లెజెండరీ ఐకానిక్ యాక్టర్ శివాజీ ఫొటో గోడపై ఉంది. ఆయనను గౌరవిస్తూ నేను ఆయన పాదాలు తాకాను’ అంటూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
డైరెక్టర్‌, నటుడు ఎస్‌జే సూర్య హీరోగా నటిస్తున్న ‘ఉయరంద మనిదన్‌’ సినిమాలో నటిస్తున్న అమితాబ్ ఈ సినిమాతో తమిళ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. తమిళ్‌వానన్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోంది.
 
ఈ సినిమా షూటింగ్‌ వర్క్ ఈ మధ్యనే ప్రారంభమైంది. అందులో భాగంగా ఎస్‌జే సూర్యతో కలిసి ఉన్న ఫొటోలను అమితాబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసారు. ఈ సినిమాలో అమితాబ్‌కు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు టాలీవుడ్‌లో అమితాబ్ "సైరా" సినిమాలో నటిస్తూ దక్షిణాదిలో దూసుకుపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు