గాయకుడిలోని సత్తా బయటపడట్లేదు.. అంతా వెరైటీ లోకమైపోయింది: ఎస్పీ

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (09:30 IST)
భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది గాయకుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడిన బాలు అతిరథమహారథులతో కలిసి పనిచేశారు. ఇంకా తెలుగు పాటకు కొత్త గమకాలను అందించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దేశంలోని దాదాపు అన్ని భాషల ప్రజలను తన గానమాధుర్యంతో అలరించిన గాయకుడు ఎస్పీబీ.
 
ఎస్పీ బాలు తర్వాత ఆ స్థాయిలో ప్రజల ఆదరణ పొందిన గాయకులెవరూ లేరు. తాజాగా ఎస్పీబీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఓ సినిమాలో ఆరురకాల పాటలుంటే అన్నీ ఒక గాయకుడి చేతే అప్పటి సంగీత దర్శకులు పాడించేవారన్నారు. దాంతో ఆ గాయకుడి స్టామినా అందరికీ తెలిసేది. ప్రస్తుతం ఒక సినిమాలో ఆరు పాటలను ఆరుగురు గాయకులు పాడుతున్నారు. 
 
ఒక్కోసారి ఒకే పాటను ఇద్దరు గాయకులచేత పాడిస్తున్నారు. గాయకుడిలో సత్తా బయటపడే అవకాశాలు ఇప్పుడు రావడం లేదు. అంతా వెరైటీ కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే చాలామంది గాయకులు అనామకులుగా మిగిలిపోతున్నార'ని బాలు ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి