క్రికెట్ ఆడిన అనసూయ... బంతులు కొట్టేందుకు ఎగబడిన కుర్రకారు..

మంగళవారం, 25 ఆగస్టు 2015 (17:27 IST)
వెండితెరపై వెలిగే అందాల తారల స్థాయికి పాపులర్ అయిన ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ. జబర్దస్త్ టీవీ ప్రోగ్రాంతో హాట్ అందాలను ప్రదర్శించిన అనసూయా ఆ తర్వాత అందులో నుంచి తప్పుకున్నా ఆమె క్రేజ్ తగ్గలేదు. టీవీ షోలలోనూ, సినిమాల ఆడియో వేడుకలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ హాట్ హాట్‌గా అనసూయ యువతను ఉర్రూతలూగిస్తోంది. 
 
అనసూయ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది. తాజాగా యువసామ్రాట్ అక్కినేని నాగార్జున సరసన నటించే ఛాన్స్ కూడా అమ్మడుకి చిక్కింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో నటించింది. ఎప్పుడూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించే అనసూయ ఆ మధ్య ఒక  కార్యక్రమానికి వచ్చినప్పుడు క్రికెట్ ఆడుతూ అక్కడున్న కుర్రకారును ఆకట్టుకుందట.
 
ఆ వీడియో తాజాగా యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. అందులో.. అమ్మడు బౌలింగ్ చేస్తుంటే... ఆమె బంతులను కొట్టేందుకు కుర్రాళ్లు ఎగబడుతున్నారు. వయ్యారాలు ఒలకబోస్తూ అనసూయ ఆడిన క్రికెట్ అదరహో అంటోంది.

వెబ్దునియా పై చదవండి