మీరంతా మీ జీవితాల్లో విసుగెత్తిపోయివుంటారని.. అందుకే తన డ్రెస్సింగ్ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అవతలి వాళ్ల జీవితాల గురించి ఆలోచించే బదులు.. ఆ సమయాన్ని మీకోసం వెచ్చిస్తే మీరు ఈ పాటికే సక్సస్ అయ్యేవాళ్లని గుర్తు పెట్టుకోండి. నేను నా భర్త ఏం చేసినా మా బతుకుల కోసమే. సినిమాలో ఉన్నందున అలాంటి డ్రెస్లు తప్పనిసరి. అయితే అదంతా ప్రొఫెషన్ మాత్రమే.
ఇక్కడితో ఆగకుండా.. ఒక వేళ తను చేసే పనులు నచ్చకపోతే పక్కన పెట్టేయండి అంతే కానీ.. ఆరోపణలు చేయడం సరికాదని నెటిజన్లకు హితవు పలికింది. ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడమంటే.. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా పెంచలేదన్న మాట నిజమవుతుందని ఘాటుగా స్పందించింది. మీ బెటర్ మెంట్ కోసం ప్రార్థిస్తానని తెలిపింది.