త్రివిక్రమ్ సినిమా లుక్‌తోనే ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో యంగ్ టైగర్ కనిపించరని.. జక్కన్న చిత్రంలో వేరొక లుక్‌లో ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది. బాక్సర్‌గా ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని.. ఈ సినిమా కోసం కూడా లాయిడ్ స్టీవెన్స్‌నే జక్కన్న రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ మూవీని ఎన్టీఆర్ పూర్తిచేసిన వెంటనే స్టీవెన్స్ హైదరాబాద్‌లో వాలిపోతాడని సమాచారం.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కోసం స్టీవెన్స్ సమక్షంలోనే ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుని దాదాపు 20కేజీల బరువును తగ్గించుకున్నాడు. ఇక ట్రైనింగ్ పిరియడ్ ముగియడంతో స్టీవెన్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పారు.
ఈ సందర్భంగా స్టీవెన్స్ ఓ ట్వీట్ చేశారు. ''తారక్‌తో వర్క్ చేయడం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని.. తారక్ కొత్త లుక్ కోసం తాను ఆతృతగా వున్నానని.. త్వరలోనే మళ్లీ కలుద్దామంటూ స్టీవెన్స్ ట్వీట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ థ్యాంక్యూ సార్ అని రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను బట్టి జక్కన్న మూవీకి కూడా యంగ్‌టైగర్‌కు ట్రైనర్‌గా స్టీవెన్స్ వ్యవహరిస్తారని తెలుస్తోంది