'రుద్రమదేవి'కి విరోధి రాజ్‌మరాజే... గంపెడాశలతో గుణశేఖర్

శుక్రవారం, 31 జులై 2015 (16:45 IST)
గుణశేఖర్‌ రుద్రమదేవి సినిమా కోసం రకరకాలుగా ప్రమోషన్‌ చేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌ నటుడు రాజ్‌ మురాద్‌ స్టిల్‌ విడుదల చేశాడు. ఇతను రుద్రమదేవితో పోరాడే శత్రువుగా కన్పించనున్నాడని తెలుస్తోంది. శత్రువు ఎంత శక్తిమంతుడైతే, ప్రధాన పాత్రధారి ధీరత్వం అంత బాగా ఎలివేట్‌ అవుతుందనేది సినిమా స్టైల్‌.
 
ఓరుగల్లు ఘనతను యావత్‌ భారతానికి చాటిచెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ద్విభాషా చిత్రం ''రుద్రమదేవి''. శత్రుదేశం దేవగిరి రాజు అనమాట. మరి అనుష్కకు ఇతనుకు మధ్య నడిచే సన్నివేశాలు ఏమేరకు వున్నాయో తెలియాలంటే సెప్టెంబర్‌ 4 వరకూ ఆగాల్సిందే.

వెబ్దునియా పై చదవండి