బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్ కోహ్లీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనుష్క, విరాట్ కలిసి కారులో వెళ్తుండగా, పక్కనే కారులో వెళ్తున్న అర్హాన్ సింగ్ అనే వ్యక్తి ప్లాస్టిక్ కవరును రోడ్డుపై పడేశాడు. అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతనిపై మండిపడింది. రోడ్డుపై ఎందుకు ప్లాస్టిక్ వేస్తున్నారు. డస్ట్‌బిన్ ఉపయోగించమని కేకలు పెట్టింది.
అయితే ఆ పిమ్మట అర్హాన్ సింగ్ ఫేస్బుక్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. కానీ అనుష్క, విరాట్ తన పట్ల ప్రవర్తించిన తీరును విమర్శించారు. తాను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు పెట్టిందని మండిపడ్డాడు. అర్హాన్ తల్లి కూడా తన కుమారుడి పట్ల అనుష్క శర్మ కేకలు పెట్టడం సబబు కాదని తెలిపింది.