సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ.. తెలంగాణ సర్కారు.. సెలెబ్రెటీల చేత యువత, ప్రజల్లో చైతన్యం కలిగిస్తోంది. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, విజయ్ దేవరకొండను బరిలోకి దించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, మాట్రీమోనీ సైట్లలో వచ్చే ప్రొఫైల్స్ చూసి మోసపోకూడదని అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ చేసే అలెర్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నకిలీ ప్రొఫైల్స్ బోలెడు మాట్రీమోనీ సైట్లలో వున్నాయని ఆరా తీశాకే వివాహానికి కమిట్ అవ్వండి అంటూ విజయ్ దేవరకొండ ఆ వీడియో ద్వారా సందేశమిచ్చారు. పేటీఎం వంటి ఇతరత్రా మనీ యాప్స్ ద్వారా అలెర్ట్‌గా వుండాలని.. వీటిలో కొన్ని హ్యాక్ అవుతున్నాయని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో మాట్రిమోనీ సైట్లలో వచ్చే ప్రొఫైల్స్ చూసి కక్కుర్తి పడకుండా ఆలోచించి.. ఆరాతీసి ముందుకుసాగండి అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు.
మాట్రిమోనీ సైట్లలో పరిచయం, ఫేస్‌బుక్‌లో మీటింగ్, స్కైప్‌లో ఎంగేజ్‌మెంట్.. ఓ షర్ట్ కొనాలంటేనే వాటి బ్రాండ్ ఆరాతీసి వందసార్లు ఆలోచించే మనం.. పెళ్లి దగ్గరకి వచ్చాక ఎందుకంత అజాగ్రత్తగా వుంటాం. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రొఫైల్ చూసినప్పుడు వాళ్ల శాలరీ ఎంత వాళ్లు అందంగా వున్నారా అని కక్కుర్తి పడకండి. అసలు వాళ్లు నిజంగా వున్నారా? జన్యునా కాదా? చూస్కోండి. ఆరా తీయండి. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా వుండండి... అంటూ విజయ్ దేవరకొండ వీడియో ద్వారా యువతను అప్రమత్తం చేశారు.