కత్తి మహేష్ తక్కువోడేం కాదు... కొట్టి బలత్కారం చేశాడు : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత

శనివారం, 14 ఏప్రియల్ 2018 (18:30 IST)
సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ తక్కువోడేం కాదనీ, తనను ఓ రోజున వాళ్లింటికి రమ్మని పిలిచాడని, గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని, అడ్డకోబోతే తనను కొట్టి బలాత్కారం చేశాడని ఆరోపించింది. ఆమె శనివారం ఓ టీవీ షో చర్చా కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యంగా, కత్తి మహేష్ గురించి మాట్లాడుతూ, 
 
వెల్లడించింది. మహేష్ గురించి సునీత వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే... "ఓ యేడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా కత్తి మహేష్ పరిచయమయ్యాడు. ఆయన అంతకుముందు హైటెక్ సిటీలో ఓ ప్రోగ్రాం చేసేవారు. ఒకసారి నేను అమీతుమీ ఆడియో ఈవెంట్‌లో మహేష్ కలిసినపుడు ఆయనకు చాలా క్రేజ్ ఉన్నట్టుంది అనుకున్నాను. అప్పటివరకూ ఆయన నాకు జస్ట్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాత్రమే. ఆయన గురించి ఏమీ తెలియదు. 
 
ఈయనేంటి బిగ్‌బాస్‌కి రావడమేంటని నేను షాక్ అయ్యాను. ఎలిమినేషన్ అయ్యాక.. నేను మీ బిగ్‌బాస్ చూశాను సార్. చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పాను. బిగ్‌బాస్ షోలో ఫోన్‌లో మాట్లాడినపుడు మీ వైఫ్‌తో లక్నోకి వెళ్తాను అన్నారు కదా.. ఎందుకు హైదరాబాద్‌కి వచ్చారు అని అడిగాను. 'నాపై ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్‌బాస్‌లో అందుకే వెనక్కి వచ్చాను అన్నారు. కలుస్తావా నన్ను..' అని అడిగారు. కత్తి మహేష్ ఇలా చేస్తే నేనెవరికి చెప్పుకోవాలి?
 
అపుడు కత్తి మహేష్‌ పై కంప్లైంట్ ఇవ్వడానికి లీగల్‌గా వెళ్లాను. ఆ సమయంలోనే జనసేన పవన్ కల్యాణ్ సార్‌కి, కత్తి మహేష్‌కి కాంట్రవర్సీ జరుగుతోంది. కానీ మహేష్‌పై కంప్లైంట్ తీసుకోలేమని పోలీసులు కరాఖండిగా తేల్చి చెప్పారు. అంతకు ముందొకసారి నన్ను పిలిచి వాళ్లింటి బయట మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను రమ్మని ఫేస్‌బుక్‌లో అడ్రస్ పెట్టాడు. కావాలంటే నేను ఫేస్‌బుక్‌లో మెసేజ్ చూపిస్తా. వెళ్లాక కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడు. నేను ముందే చెప్పాను ఎవరికి పడితే వారికి కమిట్‌మెంట్ ఇవ్వనని.. దానికి నేను అంగీకరించను. అప్పుడు నన్ను డోర్ వేసి.. కొట్టి.. బలవంతం చేశాడు. తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడు. కత్తి మహేష్‌పై అన్ని ప్రూఫ్‌లు చూపిస్తా" అని సునీత పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు