అషూ రెడ్డి డ్రెస్‌పై ట్రోల్స్.. ఆ డ్రెస్ ఏంటీ .. వీధి కుక్కలు కరిచాయా?

బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:39 IST)
Ashu Reddy
బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి డ్రెస్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ సాగుతోంది. ఢిపరెంట్ డ్రెస్‌‌‌లో కనిపించి మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. టార్న్‌ డెనిమ్‌ షర్ట్‌ వేసుకొని హాట్ లుక్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఆ ఫోటోలకు ఒక బీభత్సమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది.
 
చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక పెద్దాయన చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు.
 
ఆ డ్రెస్ ఏంటీ .. వీధి కుక్కలు కరిచాయా? అని కొందరు.. మరికొందరు చినిగిన చొక్కా ఏమైనా నీకు ఫ్రీ గా వచ్చిందా..? ఎన్ని వేలు పెట్టి కొన్నావ్.. మళ్లీ దానికి క్యాప్షన్ ఒకటి. ముందు నువ్వు కొన్న పుస్తకం చూపించు అంటూ ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు