ప్రస్తుతం ఇపుడు తమిళ, తెలుగు బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి. ఐతే బాలీవుడ్లో ఓ స్థాయిలో బిగ్ బాస్ షోను రక్తికట్టించిన హీరో సల్మాన్ ఖాన్. ఆ సమయంలో షోలో పాల్గొన్న సనాఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్‌ను ఓ ఆట ఆడుకుంది. సల్మాన్ కూడా తక్కువ తిన్లేదు కదా... తనదైన స్టయిల్లో సెటైర్లతో ఆమెకు రివర్స్ ఎటాక్ ఇచ్చాడు.
ఇదంతా జరిగిన సంగతి. కాగా కొత్తగా జీ అవార్డు ఫంక్షనుకు ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్ వచ్చాడు. ఆ సమయంలో స్టేజికి ఆవల వైపు ఉన్న సనా ఖాన్, సల్మాన్ ఖాన్‌ను చూడగనే పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని తన కౌగిలిలో బంధించింది. సల్మాన్ వాటేసుకున్నాడే కానీ ఎలాంటి ఫీలింగ్ లేకుండా చెక్క ముఖం వేసుకుని ఆమె వైపు తిరిగి ఏదో రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయాడు. కాగా సనా ఖాన్ పూర్తిగా బ్యాక్‌లెస్ దుస్తులతో అక్కడికి వచ్చింది.