అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న 'బాహుబలి'

బుధవారం, 1 జులై 2015 (20:25 IST)
ప్రభాస్‌, రానా అనుష్క, తమన్నా నటీనటులుగా రాజమౌలి దర్శకత్వంలో వస్తున్న సినిమా బాహుబలి జూలై 10న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అమెరికాలో బాహుబలి సినిమా రికార్డు థియేటర్లలో విడుదలవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 200 థియేటర్లలో బాహుబలి విడుదల కానుంది.
 
ప్రస్తుతం టికెట్‌ ధరను 25 డాలర్లుగా నిర్ణయించారు. అమెరికాలో హిందీ సినిమాకు కూడా మంచి ఆదరణ ఉంది. అయితే డబ్బింగ్‌ సినిమా కావడంతో ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారనేది ఇంకా సృష్టం కాలేదు. బాహుబలి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండటం గమనించాల్సిన విషయం. ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా మహేష్‌ బాబు ఆగడు రికార్డు నెలకొల్పింది. ఆగడు 160 థియేటర్లలో విడుదలైంది.

వెబ్దునియా పై చదవండి