ఈ నేపథ్యంలో మా ఎన్నికలపై బాలకృష్ణ స్పందించారు లోకల్, నాన్ లోకల్ అనేవాటిని అస్సలు పట్టించుకోనని చెప్పారు. గతంలో 'మా' అసోసియేషన్ లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లతో విమానాల్లో తిరిగారని... ఆ డబ్బులను ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు.
'మా' అసోసియేషన్ కు ఇంత వరకు శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా? అని ప్రశ్నించారు. అయితే 'మా' శాశ్వత భవన నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చారనే విషయాన్ని ప్రస్తావించగా... ఆ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని బాలయ్య చెప్పారు.